Cinema News: ఆట మొదలైంది

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. దయానంద్‌ దర్శకుడు. కుమార్‌ బాబు, రవి కస్తూరి, పమిడి రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి ప్రవీణ్‌

Updated : 24 Apr 2022 06:55 IST

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. దయానంద్‌ దర్శకుడు. కుమార్‌ బాబు, రవి కస్తూరి, పమిడి రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి ప్రవీణ్‌ సత్తారు క్లాప్‌ కొట్టగా.. పమిడి రమేష్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఇదొక రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలు పుష్కలంగా ఉన్నాయి. రెండు షెడ్యూల్స్‌లో ఈ చిత్రం పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి కాన్సెప్ట్‌, ఆసక్తికర మలుపులతో వస్తున్న ఈ సినిమా 2022లో ఉత్తమ చిత్రమవుతుంది’’ అన్నారు హీరో గీతానంద్‌. కార్యక్రమంలో నేహా, వసంతి, కిరీటిలు పాల్గొన్నారు. సంగీతం: అశ్విన్‌ - అరుణ్‌, ఛాయాగ్రహణం: అరవింద్‌ విశ్వనాథన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని