
Ganesh Acharya: ‘ఊ అంటావా’ కొరియోగ్రఫీ చేయనని చెప్పా: గణేశ్ మాస్టర్
ముంబయి: సెన్సేషనల్ సాంగ్ ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’కి మొదట తాను కొరియోగ్రఫీ చేయనని చెప్పానని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య తెలిపారు. సినిమా విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో ఈ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన పలు విషయాలను గణేశ్ పంచుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
‘‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో ఉన్న ‘ఊ అంటావా’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఈసినిమా విడుదల కావడానికి ముందు డిసెంబర్ 2న అల్లు అర్జున్ నాకు ఫోన్ చేశారు. ‘మాస్టర్.. మా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కి మీరు కొరియోగ్రఫీ చేయాలి’ అని అడిగారు. అప్పటికే నేను కంటిశుక్లాలకు సర్జరీ చేయించుకోవడానికి వైద్యుడి వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నా. దాంతో.. ‘ఏం అనుకోవద్దు బన్నీ.. నేను చేయలేను. ఎందుకంటే నాకు రేపే సర్జరీ ఉంద’ని చెప్పడంతో.. ఆ చిత్ర నిర్మాతలు మా డాక్టర్‌తో మాట్లాడి నా సర్జరీ డేట్‌ని మరో రోజుకి మార్చేలా చేశారు. అలా, నేను ఈ పాటకు కొరియోగ్రఫీ చేయగలిగాను. మొదటి రెండు రోజులపాటు రిహార్సల్స్ చేశాం. దీనికి ఇంత క్రేజ్ వచ్చిందంటే నా కొరియోగ్రఫీ ఒక్కటే కాదు.. సమంత-బన్నీ హార్డ్ వర్క్ కూడా ఉంది. ఈ పాటలో వాళ్లిద్దరి నటనకు అందరూ కనెక్ట్ అయ్యారు’’ అని గణేశ్ వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్
-
Sports News
Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
-
World News
Padma Bridge: బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!
-
India News
Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- AP Liquor: మద్యంలో విషం
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Lifestyle: అందమైన భార్య పక్కన ఉన్నా స్పందన లేదా?
- Amaravathi: రాజధాని భూముల అమ్మకం
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)