’గణేశ్..గణేశ్‌ మహరాజ్‌...తగ్గేదే లే’.. ఆకట్టుకుంటోన్న సినీ వినాయకులు

వినాయకచవితి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. విఘ్నేశ్వరుడి మండపాలు, భక్తుల కోలాహలం, తొమ్మిది రోజుల భజనలతో ఊరూవాడలు సందడి చేస్తాయి. ఇక యువత కేరింతలకైతే...

Published : 31 Aug 2022 13:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. వినాయకుడి మండపాలు.. భక్తుల కోలాహలం.. తొమ్మిది రోజుల భజనలతో ఊరూవాడల్లో సందడే సందడి. ఇక యువత కేరింతలకైతే హద్దే ఉండదు. ఈ వేడుకలకు సినిమాలనూ జోడించి సంబరాలు చేసుకుంటారు. ఈ ఏడాది కూడా ప్రేక్షకాదరణ పొందిన సినిమాలలోని పాత్రల రూపంలో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి యువత గణపతి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలా..ఈ వినాయక పండగకు కొలువుదీరిన విగ్రహాల్లో కొన్ని ఇవే..

పాన్‌ ఇండియా సినిమాగా విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్‌ నటనతో పాటు అతడి మేనరిజానికీ దేశవ్యాప్తంగా అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు అదే మేనరిజంతో కూడిన గణేశ్‌ విగ్రహాలు పలు చోట్ల విశేషంగా అలరిస్తున్నాయి. ఈ విగ్రహాలను చూసి.. భక్తులను కాపాడటంలో గణేశుడు తగ్గేదేలే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

* ఈ ఏడాది విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌ సంపాదించుకుందో తెలిసిందే. రూ.వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇందులోని రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పాత్రలను పోలిన వినాయక విగ్రహాలు పలు చోట్ల ఆకట్టుకుంటున్నాయి. తారక్‌-చరణ్‌ అభిమానులు వీటిని ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహిస్తున్నారు.

భారతీయ సినీ అభిమానులను విశేషంగా అలరించిన పాత్ర బాహుబలి. తల్లికిచ్చిన మాటను నెరవేర్చే కొడుకుగా కనిపించిన బాహుబలి రూపంలో గణేశుడి విగ్రహాలను గతంలో మనం చూశాం. గతంలో గబ్బర్ సింగ్‌ వినాయకుడిని కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేశ్‌ విగ్రహాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని