Bigg Boss Telugu 7: మూడో పవర్ అస్త్ర.. వీడియోస్ చూపించి మంట పెట్టిన బిగ్‌బాస్..!
బిగ్‌బాస్ సీజన్-7లో భాగంగా మూడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈ సందర్భంగా ఇంటిసభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్-7లో భాగంగా మూడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈ సందర్భంగా ఇంటిసభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంట్లో ఉండేందుకు ఎవరు అనర్హులో సరైన కారణాలు చెప్పి, ఇద్దరిని నామినేట్ చేయమనగా, ప్రతి ఒక్కరూ చిన్న చిన్న కారణాలతో నామినేట్ చేయడంపై బిగ్‌బాస్ ఒకటికి రెండుసార్లు హెచ్చరించాడు. అయినా కూడా ఇంటి సభ్యులు తమ పంథాను వీడలేదు. అలా ఈ వారం శుభశ్రీ , గౌతమ్‌కృష్ణ, ప్రియాంక జైన్, దామిని రతిక రోజ్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్‌లు నామినేట్ అయ్యారు.
ఈ క్రమంలో బిగ్‌బాస్ (Bigg Boss Telugu 7) ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ‘ఈ వారం నామినేట్ అయిన వారి నుంచి ఒకరిని సేవ్ చేసి, సేఫ్‌గా ఉన్న ఒకరిని నామినేట్ చేయండి’ అని సూచించగా, పవర్ అస్త్రాలు పొందిన సందీప్, శివాజీలకు సూచించాడు. దీంతో వాళ్లిద్దరూ మాట్లాడుకొని, అప్పటికే సేఫ్‌గా ఉన్న అమర్ దీప్, ప్రశాంత్, శోభా శెట్టిలలో ఒకరిని నామినేట్ చేయాల్సి వచ్చింది. చాలా సేపు చర్చ తర్వాత అమర్ దీప్‌ని నామినేట్ చేస్తున్నట్లు సందీప్ చెప్పాడు. ‘గతవారం మాయాస్త్రను దక్కించుకోవడానికి నీకు నేను ఒక అవకాశం ఇచ్చాను. నువ్వు స్ట్రాంగ్ కంటెండర్.. మళ్లీ తిరిగి వస్తావనే నమ్మకం ఉంది. అందుకే నామినేట్ చేస్తున్నా’ అంటూ సందీప్ చెప్పడంతో అమర్‌దీప్ షాకయ్యాడు.
ఇక నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులందరూ గ్రూపులుగా విడిపోయి మాట్లాడుకోవడం ప్రారంభించారు. దామిని సేఫ్ గేమ్ ఆడుతోందని శివాజీ ఆరోపించాడు. ‘ఇంటి సభ్యులెవరూ పల్లవి ప్రశాంత్‌ను ఎందుకు నామినేట్ చేయలేదు. అతనితో మనకెందుకు అనుకుంటున్నారేమో’ అని టేస్టీ తేజ, సందీప్ చర్చ పెట్టారు. ‘ఎందుకో మైండ్ ఆఫ్ అయిపోయింది’ అంటూ రతికా రోజ్ బాధపడుతుండగా, పల్లవి ప్రశాంత్ వచ్చి ఓదార్చాడు. ఆ తర్వాత అసలు ప్రక్రియను బిగ్‌బాస్‌మొదలు పెట్టాడు. మూడో పవర్ అస్త్ర కోసం కంటెండర్‌లుగా అమర్‌దీప్, శోభ, ప్రిన్స్ యావర్‌లను బిగ్‌బాస్ (Bigg Boss Telugu 7) ఎంపిక చేశాడు. దీంతో మిగిలిన ఇంటి సభ్యులు కాస్త నిరాశ చెందారు. ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. హౌస్‌లో ఉన్న మిగిలిన వాళ్లను కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి, అమర్‌దీప్, శోభ, యావర్‌లు పవర్ అస్త్రాను పొందడానికి ఎందుకు అనర్హులో కారణాలు చెప్పమన్నాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులు చెప్పిన కారణాల వీడియోను ఆ ముగ్గురికి చూపిస్తానని చెప్పడంతో అందరూ షాకయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ మాదే కానీ..: గడ్కరీ
-
BJP: తెలంగాణకు రెండో వారంలో అమిత్‌షా.. 6న నడ్డా
-
World Culture Festival: శాంతి, సామరస్య ప్రపంచం కోసం అందరం కలిసి కృషి చేయాలి!
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి