Gangaster Gangaraju: ఓటీటీలో గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

లక్ష్ చదలవాడ (Laksh Chadalavada), వేదికా దత్‌ (Vedika Dutt) జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’.

Published : 14 Aug 2022 16:33 IST

హైదరాబాద్‌: లక్ష్ చదలవాడ (Laksh Chadalavada), వేదికా దత్‌ (Vedika Dutt) జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’. ఇషాన్‌ సూర్య దర్శకుడు. జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా విడుదలైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. హాస్యం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుగా,  పిల్లల దగ్గర్నుంచి, పెద్దల వరకు అందరూ చూడగలిగేలా సినిమాను తీర్చిదిద్దినట్లు గతంలో చిత్ర బృందం తెలిపింది. అన్నట్లుగానే బాక్సాఫీస్‌ వద్ద మంచిటాక్‌నే తెచ్చుకుంది.  ముఖ్యంగా యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఆకట్టుకున్నాయి. లక్ష్‌ తన పాత్రలో రెండు డిఫెరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ బాగా ఆకట్టుకున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని