Gangubai Kathiawadi: నటనతో అదరగొట్టేసిన అలియా.. ట్రైలర్‌ చూశారా..!

బాలీవుడ్‌ కథానాయిక ఆలియాభట్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయ్‌ కతియావాడీ’. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు...

Updated : 04 Feb 2022 15:11 IST

ముంబయి: బాలీవుడ్‌ కథానాయిక అలియాభట్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడీ’. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ముంబయిలోని మాఫీయా క్వీన్‌ గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరోనా పరిస్థితుల రీత్యా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ‘గంగూబాయి కతియావాడీ’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘‘కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా వెలుగు ఉంటుంది ఎందుకంటే అక్కడ గంగూబాయి ఉంటుంది’’ అని అజయ్‌దేవ్‌గణ్‌ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా ఉంది. గంగూబాయిగా అలియా నటన అదరగొట్టేలా సాగింది. ‘‘మీకు నా మాటలు అభ్యంతరకరంగా అనిపించొచ్చు. కానీ, జాగ్రత్తగా వినండి. నిజం చెప్పాలంటే మీకంటే ఎక్కువ గౌరవం మాకే ఉంది. ఎందుకు అని అడగాలనుకుంటున్నారా? ఒక్కసారి మీరు మర్యాదను పోగొట్టుకుంటే.. మొత్తంగా పోయినట్టే. కానీ మేము ప్రతి రాత్రి గౌరవాన్ని అమ్ముకుంటాం. కానీ మా గౌరవం ఎప్పటికీ పోదు.’’ అని అలియా చెప్పే డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని