Gargi: సాయి పల్లవి ‘గార్గి’.. ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది

సాయి పల్లవి ‘గార్గి’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ సినిమా ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ కానుందంటే...

Published : 04 Aug 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోర్టు డ్రామా నేపథ్యంలో సాయి పల్లవి (Sai Pallavi) నటించిన ‘గార్గి’ (Gargi) సినిమా థియేటర్లలో ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆలోచింపజేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ చిత్రం ‘సోనీలివ్‌’లో (SonyLiv) ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్‌. ఎస్‌. శివాజీ, కాళీ వెంకట్‌, కలైమణి శరవణన్‌, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు.

ఈ సినిమా క‌థేంటంటే: గార్గి (సాయిప‌ల్లవి) ఓ ప్రైవేట్ స్కూల్‌ టీచ‌ర్. ఆమె తండ్రి బ్రహ్మానందం (ఆర్‌.ఎస్‌.శివాజీ) (RS Shivaji) ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తుంటారు. ఆ అపార్ట్‌మెంట్‌లో ఒక‌రోజు తొమ్మిదేళ్ల బాలిక‌పై అత్యాచారం జ‌రుగుతుంది. ఆ కేసులో ఆరు ప‌దుల వ‌య‌సున్న బ్రహ్మానందాన్ని కూడా అరెస్ట్ చేస్తారు. అయితే త‌న తండ్రి ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని, అన్యాయంగా పోలీసులు ఆయ‌న‌పై త‌ప్పుడు కేసు పెట్టార‌ని గార్గి బ‌లంగా న‌మ్ముతుంది. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంది. కానీ, ఆమె త‌ర‌ఫున వాదించేందుకు ఏ న్యాయ‌వాదీ ముందుకు రారు. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆమెకు అండ‌గా నిలిచిందెవ‌రు? ఈ న్యాయ పోరాటంలో ఆమెకు ఎదురైన స‌వాళ్లేంటి? ఆ అత్యాచార ఘ‌ట‌న త‌ర్వాత స‌మాజం నుంచి ఆమె కుటుంబం ఎలాంటి అవ‌మానాలు ఎదుర్కొంది? ఈ కేసు నుంచి గార్గి (Gargi) తండ్రి నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌చ్చాడా? లేదా? అన్నది మిగతా కథ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని