Published : 07 Jul 2022 18:09 IST

Gargi: సాయి పల్లవి న్యాయపోరాటం.. ‘గార్గి’ ట్రైలర్‌ వచ్చేసింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యాయం కోసం పోరాడే యువతి పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi) నటించిన చిత్రం ‘గార్గి’ (Gargi). గౌతమ్‌ రామచ్రంద దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది. తెలుగు ట్రైలర్‌ను నాని (nani), రానాలతో (rana daggubati), తమిళ ట్రైలర్‌ను సూర్య, ఆర్య, అనిరుధ్‌, లోకేశ్‌ కనగరాజ్‌లతో విడుదల చేయించింది. ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన అనంతరం వారంతా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సన్నివేశాలతో ఆసక్తిగా సాగింది. ఈ క్రమంలో వినిపించిన సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. తన నటనతో సాయి పల్లవి ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో రానా సమర్పిస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని