Gautham-Manjima: వివాహబంధంతో ఒక్కటైన కోలీవుడ్‌ స్టార్‌ జోడీ

కోలీవుడ్‌ యువ నటుడు గౌతమ్‌ కార్తిక్‌, నటి మంజిమా మోహన్‌ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.

Updated : 28 Nov 2022 11:52 IST

చెన్నై: కోలీవుడ్‌ యువ జంట గౌతమ్‌ కార్తిక్‌ (Gautham Karthik) - మంజిమా మోహన్‌ (Manjima Mohan) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబసభ్యుల అంగీకారంతో సోమవారం పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని యువ జంటను అభినందించారు. పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న ఈ జోడీకి సంబంధించిన ఓ ఫొటో బయటకు రావడంతో అభిమానులు కంగ్రాట్స్‌ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘దేవరట్టం’ సినిమా కోసం మంజిమ-గౌతమ్‌ కలిసి పనిచేశారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టారు. తనే మొదట ఆమెకు ప్రపోజ్‌ చేశానని ఇటీవల గౌతమ్‌ తెలిపారు. సుమారు మూడేళ్ల నుంచి వీరు ప్రేమలో ఉన్నారు. పెద్దలు అంగీకరించడంతో నేడు వివాహం చేసుకున్నారు. ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో మంజిమ, ‘కడలి’తో గౌతమ్‌ తెలుగువారికి సుపరిచితులే.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని