Ram Pothineni: రామ్‌తో సినిమా తీయనున్న టాప్ డైరెక్టర్‌... ఎవరంటే?

ఏమాయచేసావే సినిమాతో రొమాంటిక్‌ దర్శకుడిగా గౌతమ్‌మేనన్‌ పేరుతెచ్చుకున్నారు. త్వరలోనే ఈ టాప్‌ డైరెక్టర్‌ చాక్లెట్‌బాయ్‌ రామ్‌తో సినిమా తీయనున్నారు.  

Updated : 16 Sep 2022 12:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఏమాయచేసావే’ సినిమాతో రొమాంటిక్‌ దర్శకుడిగా గౌతమ్‌మేనన్‌ పేరుతెచ్చుకున్నారు. త్వరలోనే ఈ టాప్‌ డైరెక్టర్‌.. రామ్‌తో సినిమా తీయనున్నారు.  స్రవంతి మూవీస్‌ పతాకంపై ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. ప్రస్తుతం గౌతమ్‌ మేనన్‌ ‘జోషువా ఇమై పోల్‌ కాఖా’, విక్రమ్‌తో ‘ధ్రువ నక్షత్రం’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత రామ్‌ సినిమా మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శింబు హీరోగా తెరకెక్కించిన ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ అనే చిత్రంతో గౌతమ్‌ మేనన్‌  తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని