దీపికకు సోనాక్షి మద్దతు

జేఎన్‌యూ సందర్శన విషయంలో బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణెకు మరో బాలీవుడ్‌ తార మద్దతు తెలిపారు. దీపిక చేసింది సరైన పనే అని నటి సోనాక్షి సిన్హా ట్విటర్‌ వేదికగా స్పందించారు.

Published : 09 Jan 2020 01:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జేఎన్‌యూ సందర్శన విషయంలో బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణెకు మరో బాలీవుడ్‌ తార మద్దతు తెలిపారు. దీపిక చేసింది సరైన పనే అని నటి సోనాక్షి సిన్హా ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘మీరు ఏ రాజకీయ పార్టీకైనా మద్దతు ఇవ్వండి. కానీ, హింసకు మద్దతివ్వరు కదా.? జేఎన్‌యూలో విద్యార్థులకు రక్తం కారుతున్న చిత్రాలు మిమ్మల్ని కదిలించలేదా..? మనం వలయం సృష్టించుకొని అందులోనే కూర్చోలేం కదా. ఈ విషయంలో దీపికకు అభినందనలు. ఆమె తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేసింది. కామ్‌గా కూర్చోవడానికి ఇది సరైన సమయం కాదు’ అని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.
దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన దాడిలో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించేందకు దీపిక బుధవారం వర్సిటీకి వెళ్లారు. అయితే, పలువురు భాజపా నేతలు ఆమెను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. ఆమె సినిమా ప్రచారం కోసం అక్కడికి వెళ్లిందని, ఆమె తీసిన చపాక్‌ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దీపికకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్‌ నాయకులు సైతం స్పందించారు. తాజాగా సోనాక్షి తన మద్దతు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని