జేఎన్‌యూ ఘటనపై స్పందించిన బన్నీ
జేఎన్‌యూలో జరిగిన దాడిపై టాలీవుడ్ కథానాయకుడు అల్లు అర్జున్ స్పందించారు. ఇటీవల జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోకి పలువురు ఆగంతకులు చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జేఎన్‌యూలో జరిగిన దాడి పట్ల పలువురు సెలబ్రిటీలు...
హైదరాబాద్: జేఎన్‌యూలో జరిగిన దాడిపై టాలీవుడ్ కథానాయకుడు అల్లు అర్జున్ స్పందించారు. ఇటీవల జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోకి పలువురు ఆగంతకులు చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జేఎన్‌యూలో జరిగిన దాడి పట్ల పలువురు సెలబ్రిటీలు సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ సైతం జేఎన్‌యూ దాడిపై స్పందించారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటించిన ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ఇందులో భాగంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో జరుగుతోన్న నిరసనల గురించి స్పందించారు.
‘జేఎన్‌యూలో జరిగిన దాడి గురించి తెలిసి నేనెంతో బాధపడ్డాను. దీనికి సరైన పరిష్కారం ఉంటుందని భావిస్తున్నాను.’ అని బన్నీ తెలిపారు. అనంతరం పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనల గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ నిజాయితీగానే ఉంటాను. ఇటీవల ఇదే విషయం గురించి అజయ్ దేవగణ్ చెప్పిన మాటలు నాకెంతో నచ్చాయి. ఏది ఏమైనా ప్రథమంగా మేమందరం సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేవాళ్లం. మాకూ గొంతు ఉంది. ఇలాంటి సంఘటన గురించి మాట్లాడగలిగే శక్తి కూడా ఉంది. కాకపోతే మేము ఏ విషయం గురించి మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఆ తర్వాత అది మా మీద ఎన్నో విధాలుగా ప్రభావం చూపిస్తుంది.’ అని బన్నీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్‌హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్‌ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్‌గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!