వ్యభిచార గృహం నిర్వహిస్తున్న దర్శకుడి అరెస్టు

జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఓ క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. నవీన్‌ కుమార్‌ ప్రేమ్‌లాల్‌ ఆర్య(32) బాలీవుడ్‌లోని

Published : 16 Jan 2020 06:40 IST

ముంబయి: జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఓ క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. నవీన్‌ కుమార్‌ ప్రేమ్‌లాల్‌ ఆర్య(32) బాలీవుడ్‌లోని పలు సినిమాలకు క్యాస్టింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులు అజయ్‌ శర్మ, విజయ్‌లతో కలిసి గత ఐదేళ్లుగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్నాడనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బయటి వ్యక్తుల్లా పోలీసులు నవీన్‌కు ఫోన్‌చేసి అమ్మాయిలు కావాలంటూ అడగడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరిని పంపుతున్నట్లు వారికి తెలిపాడు. అంతేకాదు, ఒక్కో మహిళకు రూ.60వేలతో పాటు, హోటల్‌ ఖర్చులను కూడా భరించాలని తెలిపాడు. దీంతో అమ్మాయిలతో కలిసి హోటల్‌కు వచ్చిన నవీన్‌ కుమార్‌ను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఇద్దరు మహిళల నుంచి వాంగ్మూలం తీసుకుని హోంకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని