హిట్‌ కొట్టాలనేకసితో సూర్య

ఇటీవల సూర్య నటించిన ‘ఎన్‌జీకే’, ‘మాట్రాన్‌’ చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయాయి. దీంతో ఎలాగైనా హిట్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే కసితో ఉన్నారు సూర్య. అందులో భాగంగా ఆయన నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం ‘సూరరై పోట్రు’. వేసవి వినోదంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.

Updated : 18 Jan 2020 07:58 IST

‘సూరరై పోట్రు’లో సూర్య

 

కోడంబాక్కం: ఇటీవల సూర్య నటించిన ‘ఎన్‌జీకే’, ‘మాట్రాన్‌’ చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయాయి. దీంతో ఎలాగైనా హిట్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే కసితో ఉన్నారు సూర్య. అందులో భాగంగా ఆయన నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం ‘సూరరై పోట్రు’. వేసవి వినోదంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇందులో జాకీష్రాఫ్‌, మోహన్‌బాబు, వివేక్‌ ప్రసన్న, కరుణాస్‌లు నటించారు. తన సొంత బ్యానరుపై సూర్య నిర్మించారు. ఓ సాధారణ యువకుడు ఎలా విమాన సంస్థను స్థాపించారనే కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ యువతకు స్ఫూర్తివంతంగా అనిపిస్తోంది. అభిమానులు కోరుకునే విధంగా ఇందులో మాస్‌, కమర్షియల్‌ అంశాలన్నీ ఉండేలా చూసుకున్నారట సూర్య. ‘సర్వం తాళమయం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ బాలమురళి ఇందులో కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే సింగిల్‌ ట్రాక్‌ను ఆవిష్కరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని