‘ అల వైకుంఠపురంలో’ ఆ విషయాన్ని నిరూపించింది

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా విడుదలై రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా...

Updated : 20 Jan 2020 06:55 IST

విశాఖ: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా విడుదలై రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా చిత్రం విజయోత్సవ సభను ఆదివారం విశాఖలో నిర్వహించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘విలువలతో సినిమా తీయండి.. మేమెందుకు ఆదరించమో చూపిస్తామని మీరందరూ చెప్పారు. అది మాకెంతో నమ్మకాన్నిచ్చింది. మాకే కాదు తెలుగు సినిమాకి నమ్మకాన్నిచ్చింది. ఈ చిత్రంలో చూపించిన గౌరవప్రదమైన స్త్రీ పాత్రలను మేము గుండెల్లో పెట్టుకుంటాం, నెత్తిన పెట్టుకుంటాం అని వాళ్లను ప్రేమించి ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లారు. మీ సంస్కారానికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.

కథానాయకుడు అల్లు అర్జున్‌ మాట్లాడుతూ..  నా మొట్ట మొదటి థ్యాంక్యూ తెలుగు ప్రేక్షకులకు చెప్పాలనుకొంటున్నాను. థ్యాంక్యూ.. ఎందుకంటే ఫోన్లు వచ్చేస్తున్నాయి.. టీవీలు వచ్చేస్తున్నాయి.. థియేటర్లకు ఇంకా జనాలు రావట్లేదు. కలెక్షన్లు తగ్గుతాయి, థియేటర్లలో సినిమా ఆడటం కొంచెం కష్టమవుతుందని అనుకున్నాం. ఇలా మేం ఆలోచిస్తున్న సమయంలో.. మీరు మంచి సినిమా ఇవ్వండి మేము అంతా థియేటర్లకు ఎందుకు రాము అని నిరూపించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను థ్యాంక్యూ తమన్‌కూ చెప్పాలి. ఎందుకంటే సినిమా చిత్రీకరణ ప్రారంభంలో ఎలాంటి మ్యూజిక్‌ కావాలని తమన్‌ అడిగారు. 1 బిలియన్‌ వ్యూస్‌ వచ్చే మ్యూజిక్‌ కావాలని అడిగాను. నిజంగానే తను 1 బిలియన్‌ వ్యూస్‌ వచ్చే ఆల్బమ్‌ను ఇచ్చాడు. థాంక్యూ తమన్‌ మాట నిలబెట్టినందుకు అని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని