పద్మశ్రీపై కాంగ్రెస్‌ ఫైర్‌.. అద్నాన్‌ సమీ కౌంటర్‌

ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్‌లో పుట్టిన సమీకి ప్రతిష్ఠాత్మక అవార్డు ఇవ్వడంపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది

Published : 27 Jan 2020 14:01 IST

దిల్లీ: ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్‌లో పుట్టిన సమీకి ప్రతిష్ఠాత్మక అవార్డు ఇవ్వడంపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది. అయితే కాంగ్రెస్‌ విమర్శలకు సమీ కాస్త ఘాటుగానే బదులిచ్చారు. 

‘ప్రభుత్వం చంచాగిరి చేసిన మ్యాజిక్‌ వల్లే అద్నాన్‌ సమీకి పద్మశ్రీ వచ్చింది’ అంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైవీర్‌ షెర్గిల్‌ ట్విటర్‌ వేదికగా ఆరోపించారు. అసోంలో చేపట్టిన ఎన్నార్సీలో కార్గిల్‌ యుద్ధంలో పోరాడిన మహ్మద్‌ సన్నావుల్లాను విదేశీయుడిగా ప్రకటించిన ప్రభుత్వం.. పాక్ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ కుమారుడికి పద్మా అవార్డును ఎలా ప్రకటించిందని ప్రశ్నించారు. 

కాగా.. జైవీర్‌ షెర్గిల్‌ ఆరోపణలకు సమీ దీటుగా సమాధానం చెప్పారు. ‘హేయ్‌ కిడ్‌.. మీ బుద్ధిని క్లియరెన్స్‌ సేల్‌ నుంచి తెచ్చుకున్నారా  లేదా సెకండ్‌ హ్యాండ్‌ స్టోర్‌ నుంచి కొనుక్కున్నారా? తల్లితంద్రుల చర్యలకు పిల్లలు ఎలా బాధ్యులవుతారు? మీరో న్యాయవాది. లా స్కూల్‌లో మీకు ఇదే నేర్పారా?’ అని సమీ ట్విటర్‌ వేదికగా దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా.. సమీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అభినందనలు తెలపడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని