రజనీకాంత్‌కు స్వల్పగాయాలు

ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్’ టీవీ షో కోసం రజనీ, బ్రిటన్‌ సాహసవీరుడు బేర్‌గ్రిల్స్‌తో  బందీపూర్‌ అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్న...

Updated : 28 Jan 2020 21:54 IST

సురక్షితంగా ఉన్నారని వెల్లడించిన సన్నిహిత వర్గాలు

బెంగళూరు: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్’ టీవీ షో కోసం రజనీ, బ్రిటన్‌ సాహసవీరుడు బేర్‌గ్రిల్స్‌తో  బందీపూర్‌ అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రజనీకాంత్‌కు చిన్నపాటి గాయాలైనట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారని.. ప్రస్తుతం ఇంటికి చేరుకున్నారని రజనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రేపటి షూటింగ్‌కు అనుమతి నిరాకరించినట్లు అటవీ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి..

రజనీకాంత్‌తో బేర్‌ గ్రిల్స్‌ ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని