
భగవత్ ‘విడాకుల’ వ్యాఖ్యలపై సోనమ్ ఆగ్రహం
దిల్లీ: ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ విడాకులపై చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివైన వారేవరైనా ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఆరెస్సెస్ సమావేశానికి మోహన్ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన భగవత్.. ‘చదువుకున్న, పలుకుబడి ఉన్న కుటుంబాల్లోనే విడాకుల కేసులు ఎక్కువగా జరుగుతాయి’ అని వ్యాఖ్యానించారు. చదువుతో వచ్చిన అహంకారం వల్లే కుటుంబాలు విడిపోతున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సోనమ్ ట్విటర్ వేదికగా ఖండించారు. ఓ మీడియా కథనాన్ని షేర్ చేసిన ఆమె.. ‘తెలివైన వ్యక్తి ఎవరైనా ఇలా మాట్లాడుతారా? ఈ మూర్ఖపు ప్రకటనలను వెనక్కి తీసుకోవాలి’ అని భగవత్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.