టు మై డియర్‌ జేమ్స్‌..

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు రిషి కపూర్‌ కన్నుమూతతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. రిషి మృతిపై ఆయన బంధువు, సహ నటుడు అనిల్‌ కుమార్‌ భావోద్వేగంగా స్పందించారు. వీరిద్దరు బాల్యంనుంచే మంచి మిత్రులు. విజయ్‌, గురుదేవ్‌, కారోబార్‌ సినిమాల్లో కలిసి నటించారు. ఒకరినొకరు జేమ్స్‌, ప్యాటన్‌గా పిలుచుకునేవారు...

Published : 30 Apr 2020 22:16 IST

రిషి కపూర్‌ మృతిపై భావోద్వేగంగా స్పందించిన అనిల్‌ కపూర్‌

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు రిషి కపూర్‌ కన్నుమూతతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. రిషి మృతిపై ఆయన బంధువు, సహ నటుడు అనిల్‌కపూర్‌ భావోద్వేగంగా స్పందించారు. వీరిద్దరు బాల్యంనుంచే మంచి మిత్రులు. విజయ్‌, గురుదేవ్‌, కారోబార్‌ సినిమాల్లో కలిసి నటించారు. ఒకరినొకరు జేమ్స్‌, ప్యాటన్‌గా పిలుచుకునేవారు. 
అనిల్‌ కపూర్‌ ట్వీట్‌ ఇదే..
‘‘టు మై డియర్‌ జేమ్స్‌.. ఎక్కడినుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు. పుట్టి పెరగడం నుంచి మన కలలను వెండితెరపై సాధ్యం చేసుకోవడం వరకు.. ఇలా అన్నింటా కలిసే ఉన్నాం. నువ్వు నాకు పెద్దన్నయ్యలాంటివాడివి. స్నేహితుడివి. అవసరమైన సందర్భాల్లో తోడుగా నిలిచావు. ఒక మెంటార్‌గా నన్ను సదా ప్రోత్సహించావు. నాకు, నా కుటుంబానికి నువ్వు అందించిన ఎనలేని ప్రేమకు కృతజ్ఞతలు. సినీ ప్రేమికులకు స్ఫూర్తిజ్యోతివి. నేను నిన్ను రోజూ మిస్సవుతాను. నువ్వు లేని ఇకముందు ఏదీ మునుపటిలా ఉండదు. కానీ.. నువ్వు ఎలా అనుకున్నావో.. నీ జీవితాన్ని నేను అలాగే సెలబ్రెట్‌ చేసుకుంటాను. - నీ ప్యాటన్‌’’ అని ముగించారు. ఈ సందర్భంగా బాల్యంలో కలిసిదిగిన అపురూపమైన ఫొటోను పంచుకున్నారు. ఇందులో బోని కపూర్‌, ఆదిత్య కపూర్‌, రిషి కపూర్‌, టుటూ శర్మా, అనిల్‌ కపూర్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు