ప్రియమణికి వెంకీ సర్‌ప్రైజ్‌..!

నటి ప్రియమణికి అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వెంకటేశ్‌-ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. ధనుష్‌ కథానాయకుడిగా తమిళంలో మంచి విజయం సాధించిన....

Updated : 05 Jun 2020 08:03 IST

హైదరాబాద్‌: నటి ప్రియమణికి అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వెంకటేశ్‌-ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. ధనుష్‌ కథానాయకుడిగా తమిళంలో మంచి విజయం సాధించిన ‘అసురన్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘నారప్ప’ తెరకెక్కుతోంది. గురువారం ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా ‘నారప్ప’ చిత్రం నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను వెంకటేశ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఇందులో ప్రియమణి సుందరమ్మగా కనిపించనున్నారు.

‘హ్యాపీ బర్త్‌డే ప్రియమణి. ఈ రోజు నీకు అద్భుతంగా ఉండాలని, అలాగే ఈ ఏడాది అంతా నీకు మంచి విజయాలు వరించాలని కోరుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్‌ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని