తను నన్ను చిన్నపిల్లలా చూస్తుంది..!

శ్రుతిహాసన్‌, తమన్నా మంచి స్నేహితులనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. శ్రుతిహాసన్‌ అంటే తనకెంతో ఇష్టమని తమన్నా ఇప్పటికే పలు సందర్భాల్లో తెలియజేశారు. తాజాగా ఆమె మరోసారి శ్రుతి అంటే తనకెంత....

Updated : 05 Jun 2020 08:23 IST

శ్రుతిహాసన్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌: తమన్నా

హైదరాబాద్‌: శ్రుతిహాసన్‌, తమన్నా మంచి స్నేహితులనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. శ్రుతిహాసన్‌ అంటే తనకెంతో ఇష్టమని తమన్నా ఇప్పటికే పలు సందర్భాల్లో తెలియజేశారు. తాజాగా ఆమె మరోసారి శ్రుతి అంటే తనకెంత ఇష్టమో వివరించారు. అంతేకాకుండా శ్రుతిహాసన్‌లో తనకి బాగా నచ్చిన విషయాన్ని అందరితో పంచుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘ఇండస్ట్రీలోని నటీనటులందరి కంటే నాకు శ్రుతిహాసన్‌ ఎక్కువ ఇష్టం. తనే నా బెస్ట్‌ ఫ్రెండ్‌. ముంబయిలో మా ఇంటికి దగ్గర్లోనే వాళ్ల ఇల్లు కూడా. కాబట్టి మేము తరచూ కలుసుకునేవాళ్లం. ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. మేమిద్దరం ఒకచోట కలిస్తే సాధారణంగా మా జీవితాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. శ్రుతికి నెగిటివిటీ అంటే ఇష్టం ఉండదు. ఆ గుణమే మేమిద్దరం మంచి స్నేహితులమయ్యేలా చేసింది. అంతేకాకుండా ఇప్పటికీ తను నన్ను ఓ చిన్నపిల్లలానే చూస్తుంది.’ అని తమన్నా తెలిపారు. గోపీచంద్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సిటీమార్‌’లో తమన్నా నటిస్తోంది. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు శ్రుతిహాసన్‌ సైతం ‘క్రాక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ కథానాయకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు