స్నేహ ఇంటి కరెంట్‌ బిల్లు @42 వేలు

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరెంట్‌ బిల్లు చెల్లించడం పేద ప్రజలకు ఇబ్బందిగా మారిందని..  వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించేందుకు అధికారులు అంగీకరిస్తే బాగుంటుందని నటి స్నేహా భర్త ప్రసన్న కోరారు. తాజాగా ఆయన ఇంటికి....

Updated : 05 Jun 2020 15:03 IST

ట్వీట్‌ చేసిన నటి భర్త.. స్పందించిన టీఎన్‌ఈబీ

చెన్నై: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరెంట్‌ బిల్లు చెల్లించడం పేద ప్రజలకు ఇబ్బందిగా మారిందని..  వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించేందుకు అధికారులు అంగీకరిస్తే బాగుంటుందని నటి స్నేహ భర్త ప్రసన్న కోరారు. తాజాగా ఆయన ఇంటికి రూ.42 వేలు కరెంట్‌ బిల్లు వచ్చింది. ఈ బిల్లుపై స్పందిస్తూ ‘లాక్‌డౌన్‌ సమయంలో టీఎన్‌ఈబీ(తమిళనాడు పవర్‌ జనరేషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌) మనల్ని దోచుకుంటోందని ఎంతమంది భావిస్తున్నారు?’ అని ఓ ట్వీట్‌ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించి ‘లాక్‌డౌన్‌ సమయంలో టీఎన్‌ఈబీ కరెంట్‌ బిల్లులను ఎక్కువ మొత్తంలో విధిస్తోంది’ అంటూ కామెంట్లు పెట్టారు.

కాగా, ప్రసన్న పెట్టిన ట్వీట్‌పై తాజాగా టీఎన్‌ఈబీ స్పందించింది. ‘ప్రసన్న.. మార్చి నెల నుంచి మీరు కరెంట్‌ బిల్లును చెల్లించలేదు. అలా ఈ నాలుగు నెలలకు గాను మీరు చెల్లించాల్సిన మొత్తం కరెంట్‌ బిల్లు రూ.42,632. కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా మీటర్‌ రీడింగ్‌ తీయడం లేదని మేము ముందే వెల్లడించాం. అందుకు అనుగుణంగానే ముందు నెలలో ఎంత బిల్లు వచ్చిందో.. అదే మొత్తాన్ని మార్చి నెలలో చెల్లించమని కోరాం’ అని టీఎన్‌ఈబీ పేర్కొంది.

టీఎన్‌ఈబీ ట్వీట్‌పై ప్రసన్న స్పందిస్తూ.. ‘వ్యక్తిగతంగా ఆ మొత్తాన్ని చెల్లించడం నాకు సమస్య కాదు. మీరు చెప్పిన మొత్తాన్ని నేను చెల్లించేశాను. కరెంట్‌ బిల్లు కట్టడంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియజేయాలని భావించాను. బిల్లులు చెల్లించడం విషయంలో ప్రభుత్వం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలని ఆశిస్తున్నాను. ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్ధతిలో చెల్లించేందుకు అంగీకరిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. నేను చేసిన ట్వీట్‌తో మీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఏమైనా ఇబ్బంది పడితే క్షమించండి.’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని