దక్షిణాది పాటలకు శిల్పాశెట్టి టిక్‌టాక్‌

దక్షిణాది చిత్రాల్లోని పలు పాటలతో ప్రేక్షకులను అలరించారు నటి శిల్పాశెట్టి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఇటీవల టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన ఆమె...

Updated : 08 Dec 2022 13:05 IST

వైరల్‌గా మారిన వీడియో

ముంబయి: దక్షిణాది చిత్రాల్లోని పలు పాటలతో ప్రేక్షకులను అలరించారు నటి శిల్పాశెట్టి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఇటీవల టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన ఆమె తన భర్తతో కలిసి ఫన్నీ వీడియోలు రూపొందించి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. కాగా, తాజాగా శిల్పా.. దక్షిణాది చిత్రాలకు సంబంధించిన పలు ప్రముఖ‌ పాటలకు టిక్‌టాక్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. తెలుగు నుంచి ‘అల.. వైకుంఠపురములో..’లోని ‘సామజవరగమన’, తమిళంలో ‘రౌడీ బేబీ’ పాటలతోపాటు కన్నడ పాటలతో ఆమె మెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని