మేడపై నుంచి దూకమంటే..

విశాల్‌ని తాను ఎంతగానో మిస్సవుతున్నానని దర్శకుడు మిష్కన్‌ తెలిపారు. విశాల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘డిటెక్టివ్‌’ చిత్రానికి మిష్కన్‌ దర్శకుడిగా పనిచేశారు. అయితే ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్న సమయంలో....

Published : 06 Jun 2020 03:21 IST

విశాల్‌ ఓ మంచి నటుడు :మిష్కన్‌

చెన్నై‌: విశాల్‌ని తాను ఎంతగానో మిస్సవుతున్నానని దర్శకుడు మిష్కన్‌ తెలిపారు. విశాల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘డిటెక్టివ్‌’ చిత్రానికి మిష్కన్‌ దర్శకుడిగా పనిచేశారు. అయితే ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ‘డిటెక్టివ్‌ 2’ దర్శకత్వ బాధ్యతల నుంచి మిష్కన్‌ వైదొలగగా విశాల్‌ ఆ బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మిష్కన్‌.. విశాల్‌తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.

‘‘డిటెక్టివ్‌-2’ తెరకెక్కిస్తున్న సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ విషయంలో విశాల్‌ ఆగ్రహానికి గురయ్యాడు. నాకు కూడా బాగా కోపం వచ్చింది. అలా మేమిద్దరం దూరమయ్యాం. అతను నాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతనిపై నాకు ప్రేమాభిమానం ఉంది. అతను నాకో సోదరుడు లాంటివాడు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం విశాల్‌ని ఎంతో మిస్‌ అవుతున్నా. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు వారానికి రెండుసార్లు విశాల్‌ నా ఆఫీస్‌కి వచ్చేవాడు. నాతో సరదాగా ఉండేవాడు. విశాల్‌ నిప్పులాంటి మనిషి. మంచి నటుడు. ఒకవేళ సినిమా కోసం ఐదంతస్తుల మేడపై నుంచి దూకమంటే ఎందుకు? అని ప్రశ్నించడు. ఎక్కడ నుంచి దూకాలో చెప్పమని మాత్రమే అడుగుతాడు.’ అని మిష్కన్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు