మా నాన్న తర్వాత తనంటేనే నాకు భయం

ఉన్నది ఉన్నట్లుగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వాళ్లలో ఎప్పుడూ ముందుంటారు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. జూన్‌ 10న ఆయన 60 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా

Updated : 09 Jun 2020 21:19 IST

హైదరాబాద్‌: ఉన్నది ఉన్నట్లుగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వాళ్లలో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. తన నటనతో అభిమానులు, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశారు. జూన్‌ 10న ఆయన 60 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు మీకోసం..

మీకు 60 సంవత్సరాలు అంటే నమ్మబుద్ధి కావడం లేదు!

బాలకృష్ణ: ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నా వయసు 60 కాదు 16 అని చెప్పాను. 14ఏళ్ల వయసులో నట జీవితం ప్రారంభించాను కాబట్టి, ఇంకో ఇంటర్వ్యూలో 14ఏళ్లు అని చెప్పా. ఇంకా తక్కువ చెప్పవచ్చేమోనని ఇప్పుడు ఆలోచిస్తున్నా. 60 పక్కన సున్నా తీసేయండి.(నవ్వులు)

మీ 60ఏళ్ల జీవితంలో మరుపురాని సంఘటనలు ఏవైనా ఉన్నాయా?

బాలకృష్ణ: ప్రతిదీ మరుపురాని సంఘటనే. ప్రతి విషయాన్నీ ఎంజాయ్‌ చేస్తూ చేస్తా. 

ఎన్టీఆర్‌ నట, రాజకీయ వారసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారు? మీకెలా అనిపిస్తోంది?

బాలకృష్ణ: నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఉండటం మొదట్లో కొంత భయంగా ఉండేది. కానీ, నాన్నగారి క్రమశిక్షణ నాకు అలవడింది. ఆయన కూడా నాకు ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదు. ‘వీరబ్రహ్మేంద్రస్వామి’ షూటింగ్‌ సందర్భంగా టేక్‌ల మీద టేక్‌లు తీసుకుంటుంటే నాన్నగారికి బాగా కోపం వచ్చింది. అందరి ముందు తిట్టేశారు. అప్పటి నుంచి ప్రతి విషయంలో బాగా ఇన్‌వాల్వ్‌ అయి చేస్తా.

బాలకృష్ణ అంటే ఎంత ప్రేమ ఉంటుందో, అంతే భయం కూడా ఉంటుంది. దీనిపై మీరేమంటారు?

బాలకృష్ణ: అదేం లేదు. భయపడాల్సిందేముంది. అందరితోనూ సరదాగా ఉంటా.

మీరు ఎన్టీఆర్‌కు భయపడతారని విన్నాం. అయితే, మీ ఇంట్లో ఇంకెవరికో కూడా భయపడతారట!

బాలకృష్ణ: బ్రహ్మణి. తను చాలా బ్యాలెన్స్‌డ్‌. ఏ విషయాన్నైనా చాలా కూల్‌గా చెబుతుంది. ఆమె వల్లే నాకు సహనం అలవడింది. తను ఏం చెప్పినా వింటా. తను లేకపోతే మా మనవడితో కలిసి అల్లరి చేస్తా. వాడికి కూడా వాళ్లమ్మ అంటే భయం.

బాలకృష్ణకు ఏదనిపిస్తే అది మాట్లాడతారు? ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు? అలా మాట్లాడటం కరక్టేనా?

బాలకృష్ణ: ఎందుకు మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్లే కదా నాన్నగారు తెలుగుదేశం స్థాపించారు. నేను కూడా అంతే!

కొందరు సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు మీరు చేసిన కామెంట్‌ సెన్సేషన్‌ అయింది కదా! దాన్ని ఏమంటారు?

బాలకృష్ణ: దానిపై ఆ తర్వాత రియలైజ్‌ అయ్యా. ఒకవేళ ఏపీ సీఎంను కలవడానికి వెళ్లే ముందు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ పిలిస్తే వెళ్లేవాడిని. అప్పుడు అలా అనడం వల్ల వాళ్లు భయపడి ఉంటారు. ప్రభుత్వాలను నేను తప్పుపట్టను. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి ప్రభుత్వం నుంచి ఓ అనుమతి కావాల్సి వస్తే, మేము చేస్తున్న సేవలకు మెచ్చి కేసీఆర్‌ ఒక్కరోజులో ఆ పని చేసి పెట్టారు. ఆయనంటే నాకు అమితగౌరవం. 

పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ వీడియోని వీక్షించండి

 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని