తన గది నుంచి బయటకురాని విజయ్‌

వెండితెరపైనే కాదు నిజజీవితంలో కూడా డ్రెస్సింగ్‌ విషయంలో సింపుల్‌గా ఉంటారు కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు విజయ్‌. అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కాస్ట్యూమ్స్‌పరంగా ఆయన ఎన్నో ఇబ్బందులు....

Published : 11 Jun 2020 14:50 IST

వాళ్లమ్మ ఎంత బతిమాలినా కూడా..

చెన్నై: వెండితెరపైనే కాదు నిజజీవితంలో కూడా డ్రెస్సింగ్‌ విషయంలో సింపుల్‌గా ఉంటారు కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు విజయ్‌. అయితే, సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కాస్ట్యూమ్స్‌పరంగా ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నటి వనితా విజయ్‌కుమార్‌ తెలిపారు. సినిమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. విజయ్‌ కథానాయకుడిగా 1995లో తెరకెక్కిన ‘చంద్రలేఖ’ చిత్రంతో వనిత కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. నంబిరాజన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ సమయంలో కాస్ట్యూమ్స్‌ నచ్చకపోవడంతో విజయ్‌ తన గది నుంచి బయటకురాలేదని ఆమె తెలిపారు.

‘‘చంద్రలేఖ’ చిత్రం కోసం విజయ్‌తో కలిసి పనిచేశాను. ఆ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో తనకిచ్చిన దుస్తులు నచ్చకపోవడంతో విజయ్‌ గది నుంచి బయటకురాలేదు.  దీంతో వాళ్లమ్మ శోభా ఆంటీ వచ్చి చాలాసేపు బతిమలాడారు. 90ల్లో కాస్ట్యూమ్స్‌ విజయ్‌కి నచ్చేవి కాదు. చాలా ఇబ్బందిపడేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో దుస్తుల కోసం ప్రత్యేకంగా డిజైనర్లు ఉండేవారు కాదు. కాస్ట్యూమర్స్‌ కుట్టి ఇచ్చిన దుస్తులను మాత్రమే నటులు ధరించాల్సి వచ్చేది. మేమందరం ఒకే వయసుకు చెందినవాళ్లం కావడంతో విజయ్‌ ఇబ్బందిని అర్థం చేసుకోన్నాను. కానీ, ఇప్పుడు ఆయన ఎన్నో విషయాలను తెలుసుకుని గొప్పవ్యక్తిగా ఎదిగారు’ అని వనితా విజయ్‌కుమార్‌ తెలిపారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని