‘సాహో’ దర్శకుడు సుజీత్‌ నిశ్చితార్థం

యువ దర్శకుడు సుజీత్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన ప్రియురాలు ప్రవల్లికతో ఆయన వివాహం కానుంది. తాజాగా వీరిద్దరి

Published : 12 Jun 2020 01:02 IST

హైదరాబాద్‌: యువ దర్శకుడు సుజీత్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన ప్రియురాలు ప్రవల్లికతో ఆయన వివాహం కానుంది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది బంధువులు మాత్రమే దీనికి హాజరయ్యారు. ప్రవల్లిక దంత వైద్యురాలిగా పనిచేస్తున్నారు. 

‘రన్‌ రాజా రన్‌’తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సుజీత్‌ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. తన రెండో చిత్రంగా ప్రభాస్‌తో ‘సాహో’ వంటి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నారు. పాన్‌ ఇండియా సినిమా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. 

మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్’ను చిరంజీవి కథానాయకుడిగా తెలుగులో రీమేక్‌ చేసే అవకాశం దక్కించుకున్నారు సుజీత్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు చూస్తున్నారు. చిరు-కొరటాల సినిమా పూర్తవగానే, ‘లూసిఫర్‌’రీమేక్‌ పట్టాలెక్కనుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని