‘ఆదిత్యవర్మ’.. కష్టంగా అనిపించింది

అగ్ర కథానాయకుడు విక్రమ్‌ కుమారుడు ధ్రువ్‌ హీరోగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘ఆదిత్యవర్మ’. తెలుగులో హిట్‌ చిత్రంగా నిలిచిన ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా ఈసినిమా తెరకెక్కింది. విజయ్‌ దేవరకొండ నటించిన పాత్రను తమిళంలో ధ్రువ్‌ పోషించారు...

Published : 12 Jun 2020 12:51 IST

ధ్రువ్‌ విక్రమ్‌

చెన్నై: అగ్ర కథానాయకుడు విక్రమ్‌ కుమారుడు ధ్రువ్‌ హీరోగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘ఆదిత్యవర్మ’. తెలుగులో హిట్‌ చిత్రంగా నిలిచిన ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. విజయ్‌ దేవరకొండ నటించిన పాత్రను తమిళంలో ధ్రువ్‌ పోషించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ధ్రువ్‌ ‘ఆదిత్యవర్మ’ పాత్ర గురించి ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ఆ పాత్ర నుంచి బయటకురావడం ఎంతో కష్టంగా ఉందని తెలిపారు. సినిమాకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేస్తూ.. ‘‘ఆదిత్యవర్మ’ పాత్ర, కథను అధిగమించడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇంకా కొనసాగుతోంది..’ అని ధ్రువ్‌ పేర్కొన్నారు.

‘ఆదిత్మవర్మ’ చిత్రాన్ని మొదట ‘వర్మ’ అనే పేరుతో తెరకెక్కించినప్పటికీ కొన్ని కారణాలతో సినిమా మొత్తాన్ని రీషూట్‌ చేశారు. ప్రస్తుతం ధ్రువ్‌ తన తండ్రి విక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. చియాన్‌ 60వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్‌ స్వరాలు అందించనున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు