ప్రతిసారీ 160 కిలోలు మోయాల్సివచ్చేది..!

‘అరణ్య’ తన కెరీర్‌లోనే అతిక్లిష్టమైన సినిమా అని నటుడు రానా దగ్గుబాటి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా ఏనుగుల సంరక్షకుడిగా...

Updated : 13 Jun 2020 11:03 IST

‘అరణ్య’ క్లిష్టమైన చిత్రం: రానా

హైదరాబాద్‌: ‘అరణ్య’ తన కెరీర్‌లోనే అతి క్లిష్టమైన సినిమా అని నటుడు రానా దగ్గుబాటి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా ఏనుగుల సంరక్షకుడిగా, ఓ ఆదివాసీ పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా గురించి రానా స్పందించారు. ఇప్పటివరకూ తన కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయలేదని చెప్పారు.

‘‘బాహుబలి’ సినిమా నా జీవితాన్ని మార్చడంతోపాటు భారతీయ సినిమా స్థాయినీ పెంచింది. సినిమా విషయంలో ప్రతి ఒక్కరికీ ఉన్న ఆలోచనలను మార్చింది. సినిమా తెరకెక్కించే విధానంలో సైతం ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ సినిమా తర్వాత నేను నటించిన విభిన్న కథా చిత్రం ‘అరణ్య’. అయితే ఇప్పటివరకూ నేను నటించిన సినిమాల్లో ‘అరణ్య’ ఎంతో క్లిష్టమైనది. ఏనుగు తొండం బరువును ప్రతిసారీ నా భుజాలపై మోయాల్సివచ్చేది. ఆ బరువు దాదాపు 160, 170 కిలోలు ఉంటుంది. నేను నటించిన ప్రతి సినిమా నా జీవితానికి ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చింది.’ అని రానా పేర్కొన్నారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘అరణ్య’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో విష్ణువిశాల్‌, పుల్‌కిత్‌ సామ్రాత్‌, జోయా హుస్సేన్‌ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 2వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని