క్రేజీ ఆఫర్‌ వద్దనుకున్న ముద్దుగుమ్మ

‘పేట’ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ మాళవికా మోహనన్‌. దీని తర్వాత ఆమె అగ్ర కథానాయకుడు విజయ్‌తో కలిసి ‘మాస్టర్‌’లో నటించారు. ఈ భారీ ప్రాజెక్టుకు లోకేష్‌ కానగరాజ్‌ దర్శకత్వం వహించారు. లాక్‌డౌన్‌ కాణంగా సినిమా విడుదల తేదీ.....

Published : 14 Jun 2020 08:49 IST

చెన్నై: ‘పేట’ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ మాళవికా మోహనన్‌. దీని తర్వాత ఆమె అగ్ర కథానాయకుడు విజయ్‌తో కలిసి ‘మాస్టర్‌’లో నటించారు. ఈ భారీ ప్రాజెక్టుకు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఇందులో నటించిన మాళవికకు యువతలో క్రేజ్‌ ఏర్పడింది. దీంతో కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఓ ప్రాజెక్టు కోసం నిర్మాతలు ఆమెను కలిసినట్లు సమాచారం. మంచి పారితోషికం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను మాళవిక వద్దనుకున్నట్లు టాక్‌. ‘మాస్టర్‌’ విడుదల తర్వాత కొత్త ప్రాజెక్టుల ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది.

మాలీవుడ్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘పట్టం పొలె’ సినిమాతో మళవిక కెరీర్‌ ఆరంభించారు. ఆపై పలు మలయాళ, కన్నడ చిత్రాలతో అలరించారు. బాలీవుడ్‌లో ఇషాన్‌ ఖత్తర్‌తో కలిసి ‘బియాన్డ్‌ ది క్లౌడ్స్‌’ కోసం పనిచేశారు. ఆమె నటించాల్సిన ‘హీరో’ సినిమా ఆగిపోయింది. విజయ్‌ దేవరకొండ ఇందులో కథానాయకుడిగా సంతకం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ముందుకు సాగలేదు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని