నన్ను ‘కమిట్‌మెంట్‌’ అడిగారు: తేజస్వి

క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కథానాయికగా మెప్పించిన తేజస్వి తాజాగా నటించిన చిత్రం ‘కమిట్‌మెంట్‌’. ఈ సినిమా ప్రమోషన్‌లో....

Published : 14 Jun 2020 13:09 IST

క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కథానాయికగా మెప్పించిన తేజస్వి తాజాగా నటించిన చిత్రం ‘కమిట్‌మెంట్‌’. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని రంగాల్లోను మహిళలకు లైంగిక వేధింపులు ఉంటాయని, కాకపోతే సినీ పరిశ్రమ గురించి కొంతమంది బయటకు వచ్చి చెప్పడంతో అందరూ ఇండస్ట్రీని తప్పుగా చూస్తున్నారని ఆమె అన్నారు. అయితే పరిశ్రమకు చెందిన కొంతమంది వ్యక్తులు మాత్రమే ఇలాంటి చెత్త వ్యవహారాలు చేస్తారని, అలాంటి వారి వల్లే ఇండస్ట్రీలో ఉన్న అందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు.

‘తెలుగు సినీ పరిశ్రమలో 90 శాతం క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. నేను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ ఫేస్ చేశా. తెలుగు అనే కాదు తమిళ, కన్నడ ఏ ఇండస్ట్రీలోనైనా ఇది జరుగుతోంది. సినిమాలు తెరకెక్కించాలనే ధృడ సంకల్పం లేకుండా సరదాగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతమంది వ్యక్తులు మాత్రమే ఛాన్స్‌ల కోసం వచ్చిన అమ్మాయిలను ‘కమిట్‌మెంట్‌’ అడుగుతారు. ఇక్కడికి వచ్చిన కొత్తలో నన్ను కూడా చాలా మంది ‘కమిట్‌మెంట్‌’ అడిగారు. కానీ నేను వాటికి ఒప్పుకోలేదు. అలాంటి వ్యక్తులందర్నీ దాటుకుంటూ మనం ముందుకు రావాలి. అప్పుడే ఇండస్ట్రీలోని మంచి వాళ్లని కలుసుకోగలుగుతాం. కాకపోతే ఇలాంటి కమిట్‌మెంట్స్‌కి ముంబయి హీరోయిన్స్‌ ఒప్పుకుంటారు. అందుకే తెలుగమ్మాయిలకి టాలెంట్‌ ఉన్నప్పటికీ ముంబయి హీరోయిన్స్‌కే ఎక్కువ అవకాశాలిస్తారు. అంతేకాకుండా తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడే కొన్ని నియమాలు పెట్టుకుని వస్తారు. బికినీ వేసుకోకూడదు. ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండాలి. కానీ ముంబయి హీరోయిన్స్‌ వీటన్నింటికీ సిద్ధమవుతారు.’ అని తేజస్వి అన్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని