ఇంతకు మించిన సంతృప్తి లేదు: చిరంజీవి

ఒకరి జీవితాన్ని కాపాడడానికి మించిన సంతృప్తి మరొకటి లేదని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన ఓ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మొదటి నుంచి...

Published : 14 Jun 2020 11:36 IST

స్పెషల్‌ వీడియా షేర్‌ చేసిన మెగాస్టార్‌

హైదరాబాద్‌: ఒకరి జీవితాన్ని కాపాడడానికి మించిన సంతృప్తి మరొకటి లేదని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన ఓ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మొదటి నుంచి ఇప్పటివరకూ తాను రక్తదానం చేసిన ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. రక్తదానం చేసిన సందర్భాలన్నీ తనకి ఎంతో సంతోషాన్ని, జీవితంలో ఒక సంతృప్తిని ఇచ్చాయని ఆయన తెలిపారు. ‘రక్తదానం చేసి వేరొకరి జీవితాన్ని కాపాడడానికి మించిన ఆనందం జీవితంలో ఏముంటుంది. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని, చాలామంది తమ రక్తాన్ని దానం చేస్తున్నారని విని సంతోషిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగమవుతోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రక్త దానం చేయండి! ప్రాణదాతలు కండి!’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎంతో మంది అభిమానులు, సినీ ప్రముఖులు రక్తాన్ని దానం చేస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలో సైతం చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు రక్తదానం చేసిన విషయం తెలిసిందే.

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత చిరంజీవి నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇందులో చిరుకి జంటగా కాజల్‌ కనిపించనున్నారు. కొణిదెల ప్రొడెక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు