సర్‌ప్రైజ్‌: నిహారికతో ఉన్న వ్యక్తి ఎవరు?

‘మెగా డాటర్‌’ నిహారిక కొణిదెల వివాహం నిశ్చయమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పెళ్లి విషయమై మెగా కుటుంబం నుంచి అధికారికంగా స్పష్టమైన

Updated : 18 Jun 2020 19:11 IST

హైదరాబాద్‌: ‘మెగా డాటర్‌’ నిహారిక కొణిదెల వివాహం నిశ్చయమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పెళ్లి విషయమై మెగా కుటుంబం నుంచి అధికారికంగా స్పష్టమైన ప్రకటన రానప్పటికీ సామాజిక మాధ్యమాల వేదికగా నిహారిక చేస్తున్న పోస్ట్‌లు ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. తాజాగా ఆమె స్టార్‌బక్స్‌ కాఫీ కప్పు ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అయితే ఆ కప్పుపై మిస్‌.నిహా (మిస్‌ని కొట్టివేసి) మిసెస్‌..? అని రాసి ఉంది. ఇప్పుడు నిహారిక మరో ఆసక్తికర ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. 

ఓ వ్యక్తిని కౌగలించుకుని నవ్వుతూ దిగిన ఫొటోను పంచుకుంటూ ‘పీక్‌ ఏ బూ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ వ్యక్తి తల వెనుక భాగం మాత్రమే కనిపించేలా ఉండటంతో ఎవరా? వ్యక్తి అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. దీంతో ఆమె అభిమానులు ‘ప్లీజ్‌ ఆ వ్యక్తి ఎవరో చెబుతారా’, ‘ఎప్పుడు ఆ వ్యక్తిని పరిచయం చేస్తారు? అంటూ ప్రశ్నలు సంధించారు. వ్యాపారవేత్తతో నిహారిక వివాహం నిశ్చయమైందని, ఆగస్టులో వీరి పెళ్లి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని