‘అయ్యప్పనుమ్‌  కోశియుమ్‌’ దర్శకుడు మృతి

ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు కేఆర్‌ సచిదానందన్‌(సచీ) కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుతో త్రిస్సూర్‌లోని జూబ్లీ మిషన్‌

Published : 20 Jun 2020 01:37 IST

త్రిస్సూర్‌: ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు కేఆర్‌ సచిదానందన్‌(సచీ) కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుతో త్రిస్సూర్‌లోని జూబ్లీ మిషన్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మృతిని ఆస్పత్రి వర్గాలు కూడా ధ్రువీకరించాయి. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థ తెగిపోవడంతో దాంతో గుండె పోటు వచ్చింది. సచీ మృతితో మలయాళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ తారలు ఆయన మృతికి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

2015లో ‘అనార్కలి’ చిత్రంతో ఆయన దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. తాజాగా పృథ్వీరాజ్‌, బిజూ మేనన్‌లతో తెరకెక్కించిన ‘అయ్యప్పనుమ్‌  కోశియుమ్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య అహం అడ్డు వస్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న దాన్ని చక్కగా చూపించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో రవితేజ - రానా కలిసి నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ రీమేక్‌ చేయబోతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని