Published : 22 Jun 2020 14:25 IST

వావ్‌.. ధ‌నుష్ వ‌ర్కౌట్‌.. వీడియో వైర‌ల్‌‌

చెన్నై: ‌కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకున్న‌ క‌థానాయ‌కుడు ధ‌నుష్‌. కేవ‌లం ద‌‌క్షిణాదిలోనే కాకుండా ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్ని కూడా త‌న న‌ట‌న‌తో అల‌రిస్తున్నారు. ఆయ‌న ‘మారి 2’ సినిమా కోసం గ‌తంలో చేసిన‌ క‌స‌ర‌త్తుల‌ వీడియో ఇప్పుడు  బ‌య‌టికి వ‌చ్చింది.

సాయిప‌ల్ల‌వి, వ‌ర‌లక్ష్మి, తోవినో థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రమిది. బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ధ‌నుష్ చొక్కా లేకుండా థామ‌స్‌తో పోరాడ‌తారు. ఆ స‌న్నివేశంలో  ధ‌నుష్ సిక్స్‌ప్యాక్‌లో క‌నిపించి‌, అభిమానుల్ని ఆక‌ట్టుకున్నారు. కాగా ఆ పాత్ర కోసం ఆయ‌న ఎంత క‌ష్ట‌ప‌డ్డారో తెలుపుతూ.. అభిమానులు తాజాగా 30 సెక‌న్ల‌ వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేశారు. ధ‌నుష్ వ‌ర్కౌట్స్‌కు సంబంధించిన అరుదైన వీడియో కావ‌డంతో అది వైర‌ల్‌గా మారింది. హీరో అంకిత‌భావాన్ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

ధ‌నుష్ గ‌త ఏడాది ‘అసుర‌న్’, ‘తూటా’ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. 2020 ఆరంభంలో ‘ప‌టాస్’ సినిమాతో త‌మిళంలో హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయ‌న చేతుల్లో ‘జ‌గ‌మే తందిరం’, ‘క‌ర్ణ‌ణ్’ అనే త‌మిళ సినిమాల‌తోపాటు హిందీ ప్రాజెక్టు ‘అత‌రంగిరే’ ఉన్నాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని