అమ్మ మృతితో నాన్న‌లో పుట్టిన‌ ఆలోచ‌న‌

విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క రామారావు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్‌ ఆసుప‌త్రికి శంకుస్థాప‌న చేసి 20 ఏళ్లు పూర్త‌యింది. ఈ ఆసుప‌త్రి ద్వారా

Published : 23 Jun 2020 01:16 IST

హైద‌రాబాద్‌: విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క రామారావు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్‌ ఆసుప‌త్రి సేవలు ప్రారంభించి 20 ఏళ్లు పూర్త‌యింది. ఈ ఆసుప‌త్రి ద్వారా ల‌క్ష‌లాది క్యాన్స‌ర్ రోగుల‌కు ఉచితంగా చికిత్స అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. పేద‌ల కోసం ఎన్టీఆర్ స్థాపించిన ఈ ఆసుపత్రి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ సోష‌ల్‌మీడియాలో మాట్లాడారు. వైద్య‌ సిబ్బందికి, దాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

‘‘ఆ రోజు మా అమ్మ క్యాన్సర్ మ‌హ‌మ్మారితో‌ మరణించడం వ‌ల్ల మా నాన్న‌‌ కలత చెందారు. అప్పుడు ఆయ‌న మదిలో జ‌న్మించిన ఆలోచ‌నే.. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిట‌ల్‌ అండ్ రీసెర్చ్ సెంటర్. నేటికి 20 వసంతాలు పూర్తి చేసుకుంది. 500 పడకలతో, 1500 మందికి పైగా సిబ్బందితో.. ఇప్పటివరకూ సుమారు 2.5 లక్షలకు పైగా క్యాన్సర్ బాధితులకు ఉత్తమ ప్రమాణాలతో చికిత్స అందించాం. క్యాన్సర్‌పై ఈ పోరాటంలో మాకు వెన్నుదన్నుగా నిలిచిన దాతలకు,  వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న ప్రభుత్వాలకు, అధికారులకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని బాల‌య్య‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని