చిరు సోదరిగా అలనాటి తార..?

అగ్ర కథానాయకుడు చిరంజీవి సోదరి పాత్రలో అలనాటి తార సుహాసిని నటించబోతున్నారా?.. అవుననే అంటున్నాయి ఫిల్మ్‌ వర్గాలు.  మలయాళంలో

Published : 25 Jun 2020 11:54 IST

జోరుగా ప్రచారం

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి సోదరి పాత్రలో అలనాటి తార సుహాసిని నటించబోతున్నారా?.. అవుననే అంటున్నాయి ఫిల్మ్‌ వర్గాలు.  మలయాళంలో హిట్‌ అందుకున్న ‘లూసిఫర్‌’ను తెలుగులో రీమేక్‌ చేయబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మించబోతున్నారు. కాగా, ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు సుహాసినిని సంప్రదించినట్లు సమాచారం.

మాతృకలో మంజూ వారియర్‌  పోషించిన పాత్రలో ఆమె నటించబోతున్నట్లు తెలుస్తోంది. సుహాసినికి కూడా పాత్ర నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు  జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు తర్వాత దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. తొలుత ఈ పాత్రకు విజయశాంతిని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి.

మోహన్‌లాల్‌-పృథ్వీరాజ్‌లు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లూసిఫర్‌’. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులో దీన్ని చిరంజీవి-రామ్‌చరణ్‌లతో తెరకెక్కిస్తారని టాక్‌ వినిపించింది. కానీ ప్రస్తుతానికి చిరంజీవి పేరును మాత్రమే ప్రకటించారు. ‘సైరా నరసింహారెడ్డి’ హిట్‌ తర్వాత చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు. కాజల్‌ కథానాయిక. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ఆగింది. త్వరలోనే తిరిగి చిత్రీకరణను ప్రారంభించబోతున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు