రాంగోపాల్‌ వర్మ కొత్త చిత్రం ‘పవర్‌స్టార్‌’

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ రాంగోపాల్‌వర్మ. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడి షూటింగ్‌లు అక్కడ ఆగిపోయి, చిత్ర పరిశ్రమ స్తంభించిపోయిన సమయంలోనూ వరుస చిత్రాలు తీస్తూ దూసుకుపోతున్నారు. ‘క్లైమాక్స్‌’ అంటూ పోర్న్‌స్టార్‌తో ఓ సినిమా తీసి ఏటీటీల వేదికగా

Published : 29 Jun 2020 01:40 IST

హైదరాబాద్‌: సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ రాంగోపాల్‌వర్మ. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడి షూటింగ్‌లు అక్కడ ఆగిపోయి, చిత్ర పరిశ్రమ స్తంభించిపోయిన సమయంలోనూ వరుస చిత్రాలు తీస్తూ దూసుకుపోతున్నారు. ‘క్లైమాక్స్‌’ అంటూ పోర్న్‌స్టార్‌తో ఓ సినిమా తీసి ఏటీటీల వేదికగా దాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా తన తర్వాతి చిత్రాన్ని కూడా ప్రకటించారు. ‘పవర్‌స్టార్‌’ పేరుతో ఓ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. ‘ఇదిగో ఇతనే నా కొత్త చిత్రం ‘పవర్‌స్టార్‌’లో స్టార్‌. ఇతను నా ఆఫీస్‌కు వచ్చిన సందర్భంలో తీసిన వీడియో ఇది. ఏ వ్యక్తితోనైనా ఇతనికి పోలికలు ఉంటే అది హఠాత్తుగా, అనుకోకుండా, ఉద్దేశపూర్వకంగా, అప్రయత్నంగా జరిగి ఉండవచ్చు’’ అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం రాంగోపాల్‌ వర్మ ‘కరోనా వైరస్‌’, ‘ది మ్యాన్‌ హూ కిల్డ్‌ గాంధీ’, ‘కిడ్నాప్‌ ఆఫ్‌ కత్రినా కైఫ్‌’  ‘మర్డర్‌’ ‘నేక్డ్’ చిత్రాలను చేస్తున్నారు. ‘నేక్డ్‌’ చిత్రం త్వరలోనే ఏటీటీ వేదికగా విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని