‘బంగారు బుల్లోడు’ టీజర్‌ నవ్వులే నవ్వులు

తనదైన కామెడీ టైమింగ్‌లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కథానాయకుడు అల్లరి నరేష్‌. ఆయన హీరోగా పీవీ గిరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పుజా ఝవేరి కథానాయిక. మంగళవారం అల్లరి నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల

Published : 01 Jul 2020 01:20 IST

హైదరాబాద్‌: తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కథానాయకుడు అల్లరి నరేష్‌. ఆయన హీరోగా పీవీ గిరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పుజా ఝవేరి కథానాయిక. మంగళవారం అల్లరి నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. హాస్య ప్రధాన చిత్రాలకు పెట్టింది పేరైన అల్లరి నరేష్ మరోసారి తన కామెడీ టైమింగ్‌ అలరించారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని