సరోజ్‌ఖాన్ నృత్యాలకు శ్రీదేవి అభినయం..
కొరియోగ్రాఫర్‌గా సరోజ్‌ఖాన్ బాలీవుడ్లో ఎన్నో పాటలకు నృత్యరీతులు సమకూర్చారు. కానీ కొందరు తారలు మాత్రమే ఆమె నృత్యాన్ని తెరపై ప్రదర్శించి ఆమెకు పేరు తెచ్చిపెట్టడంతోపాటు.. నటనలోనే కాదు డాన్స్‌లో అదరగొడతామని చాటిచెప్పారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీదేవి గురించి. సరోజ్ ఖాన్
కొరియోగ్రాఫర్‌గా సరోజ్‌ఖాన్ బాలీవుడ్లో ఎన్నో పాటలకు నృత్యరీతులు సమకూర్చారు. కానీ కొందరు తారలు మాత్రమే ఆమె నృత్యాన్ని తెరపై ప్రదర్శించి ఆమెకు పేరు తెచ్చిపెట్టడంతో పాటూ, నటనలోనే కాదు డాన్స్‌లోనూ అదరగొడతామని చాటి చెప్పారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీదేవి గురించి. సరోజ్ ఖాన్ కంపోజ్ చేసిన నృత్యాలను శ్రీదేవి తెరపై ప్రదర్శిస్తుంటే ప్రేక్షకులు కన్నులపండువగా తిలకించేవారు. సరోజ్‌ఖాన్ డ్యాన్స్ కంపోజ్ చేసి, శ్రీదేవి అభినయంతో వచ్చిన పాటల్లో చాలామటుకు బ్లాక్బాస్టర్ హిట్. ఆ పాటలేవో ఒకసారి చూద్దాం.
మే తేరి దుష్మన్..
1986లో విడుదలైన ‘నగీనా’లో ‘మే తేరి దుష్మన్’ అంటూ సాగే పాటకు సరోజ్‌ఖాన్ నృత్యరీతులు సమకూర్చారు. ఇందులో శ్రీదేవి నాగుపాములా మెలికలు తిరుగూతూ డ్యాన్స్ చేశారు. అమ్రిష్‌పురి బూర ఊదుతూ శ్రీదేవిని రెచ్చగొడుతుండగా.. ఆగ్రహంతో ఆమె చేసే డ్యాన్స్ కనువిందుగా ఉంటుంది. నిజంగా నాగుపామే డ్యాన్స్ చేస్తుందా అనేలా సరోజ్‌ఖాన్ ఈ పాటకు నృత్యరీతుల్ని రూపొందించారు.
హవా హవాయ్
1987లో బ్లాక్బాస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం మిస్టర్ ఇండియా. సినిమానే కాదు.. అన్ని పాటలు ఆకట్టుకుంటాయి. అందులో ఓ పార్టీలో వచ్చే ‘హవా హవాయ్’ పాటలో శ్రీదేవి చేసే డ్యాన్స్‌ను సరోజ్ఖానే కంపోజ్ చేశారు. బంగారు రంగు డ్రెస్‌లో శ్రీదేవి అందంగా కనిపించడంతోపాటు ఆద్యంతం తన డ్యాన్స్‌తో మైమరిపిస్తుంది.
కాటే నహి కట్తె ఎ దిన్ ఎ రాత్
‘మిస్టర్ ఇండియా’లో పాట ‘కాటే నహి కట్తె ఎ దిన్ ఎ రాత్’. ఈ పాటను అనిల్ కపూర్, శ్రీదేవి మధ్య రొమాంటిక్‌గా తెరకెక్కించారు. పాట మొత్తం శ్రీదేవి ఒకే చీరలో కనిపించినా ఆమె శృంగారభరిత హావభావాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఆ క్రెడిట్ అంతా కూడా కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్దేనని చెప్పాలి. 1987లో ‘మిస్టర్ ఇండియా’ విడుదలైంది.
న జానే కహా సే ఆయీ హై
డాన్సర్‌గా శ్రీదేవిని మరో మెట్టు ఎక్కించిన పాట ఇది. ఓ వీధి సెట్లో వర్షంలో శ్రీదేవి ఎంత ఎనర్జిటిక్‌గా ఈ డాన్స్ చేశారో మాటల్లో చెప్పలేం. 1989లో విడుదలైన ‘చాల్బాజ్’లోనిది ఈ పాట. ఇందులో వర్షంలో తడుస్తూ శ్రీదేవి చేసిన అల్లరితో కూడిన డ్యాన్స్‌కు క్లాప్స్ కొట్టాల్సిందే. ఈ సినిమాలోని పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసినందుకు గానూ సరోజ్‌ఖాన్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది.
చాందినీ ఓ మెరి చాందినీ
1989లో విడుదలైన ‘చాందిని’లో టైటిల్ సాంగ్ ‘చాందినీ ఓ మెరి చాందినీ’ పాట అప్పట్లో ఆల్‌టైం హిట్. రిషి కపూర్, శ్రీదేవి మధ్య సాగే ఈ రొమాంటిక్ పాటకు నృత్యరీతులను సరోజ్ఖానే కంపోజ్ చేశారు. ఇందులోని మరో పాట ‘మేరీ హాతో మే’ పాటలో కూడా శ్రీదేవితో చక్కటి డ్యాన్స్ చేయించారు సరోజ్‌ఖాన్.
మోర్ని -
1991లో వచ్చిన ‘లమ్హే’లో మోర్నీ పాట రాజస్థాన్ ఎడారిలో రాత్రివేళ చిత్రీకరించారు. ఈ పాటలో శ్రీదేవి లంగావోణీలో ఎంతో అందంగా కనిపిస్తుంది. భావోద్వేగాలను పలికిస్తూనే.. చక్కటి నృత్యం చేశారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్