అర్ధరాత్రి 12 గంటలకు ఏమైంది?

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సినిమాల జోరు పెంచారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా సినిమాల విడుదల ఆగిపోయింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే చిత్రాలు షూటింగ్‌లు...

Published : 04 Jul 2020 01:36 IST

ఈసారి భయపెడతానంటున్న వర్మ

హైదరాబాద్‌: సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సినిమాల జోరు పెంచారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా సినిమాల విడుదల ఆగిపోయింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే చిత్రాలు షూటింగ్‌లు జరుపుకొంటున్నాయి. అయితే, రాంగోపాల్‌ వర్మ మాత్రం ఒక దాని తర్వాత ఒకటి వరుస చిత్రాలను విడుదల చేస్తూ, కొత్త చిత్రాలను ప్రకటిస్తూ ముందుకెళుతున్నారు. ఇటీవల ‘క్లైమాక్స్‌’, ‘నేకెడ్‌’, ‘కరోనా వైరస్‌’ వంటి చిత్రాలను నెటిజన్ల ముందుకు తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు ‘‘12 O క్లాక్’’ పేరుతో ఓ హారర్‌ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘12 O క్లాక్’ లఘు చిత్రం కాదు. ‘క్షణ క్షణం’ తర్వాత సంగీత దర్శకుడు కీరవాణి నా చిత్రానికి మ్యూజిక్ అందించారు. కీరవాణికి కూడా ఇదే మొదటి హారర్‌ చిత్రం అనుకుంటున్నా. ఈ లాక్‌డౌన్‌లో ‘12 O క్లాక్‌’ మరింత భయపెడుతుంది’’ అని ట్వీట్‌ చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని