ఆమెకు నా ఆశీస్సులు: లతా మంగేష్కర్‌

భారతీయ సినీ, సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్‌ది ప్రత్యేక స్థానం. ఆమెను ఆకర్షించింది ఓ యువ గాయని ప్రతిభ. విదేశీ సంగీతానికి భారతీయ సరాగాలను ..

Published : 09 Jul 2020 01:19 IST

 ముంబయి: భారతీయ సినీ, సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్‌ది ప్రత్యేక స్థానం. ఆమెను ఆకర్షించింది ఓ యువ గాయని ప్రతిభ. విదేశీ సంగీతానికి భారతీయ సరాగాలను జోడించి వినూత్నంగా పాడిన గాయనిని అభినందిస్తూ లతా మంగేష్కర్‌ ట్విటర్‌ వేదికగా ఆశీర్వదించారు. ‘నాకు ఒక వీడియో వచ్చింది. ఒక యువతి ఆస్ట్రియన్‌ మొజార్ట్‌ 40వ వాద్య గోష్టిని మన భారతీయ రాగంతో ఆలపించింది. మంచి గాయని కావాలని నా ఆశీర్వాదాలను అందిస్తున్నా’ అంటూ ట్విటర్ వేదికగా లతా మంగేష్కర్‌ పోస్ట్‌ చేశారు. ఇందులో పాడిన యువతి క్లాసికల్‌ సింగర్‌. ఆమె పేరు సామదిప్తా ముఖర్జీ.  

లతామంగేష్కర్ పెట్టిన పోస్టుకు ముఖర్జీ సమాధానం ఇస్తూ.. ‘‘ధన్యవాదాలు మేడమ్‌! నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఆరాధించే వారిలో నేనొకరు. నా చిన్నప్పుడు నుంచి మిమ్మల్ని గౌరవిస్తున్నా. మీ రూపంలో భగవంతుడు నన్ను ఆశీర్వదించినట్లు ఉంది. అంతకన్నా నాకింకేం కావాలి. మీ ఆశీస్సులు ఇలానే కొనసాగాలని కోరుతున్నా. నా సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అందుకునేందుకు కృషి చేస్తా.. ప్రణామమం’’ అంటూ ఆనందంగా పోస్ట్‌ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని