మరో యువ నటుడు ఆత్మహత్య!

వినోద పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ బుల్లితెర నటుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సుశీల్‌ గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని మండ్యలో తన స్వగృహంలో ఆత్మహత్య.......

Updated : 09 Jul 2020 20:13 IST

బెంగళూరు: వినోద పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ బుల్లితెర నటుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సుశీల్‌ గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని మండ్యలో తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు మండ్య ఎస్పీ తెలిపారు.

కన్నడ నాట ప్రాచుర్యం పొందిన ‘అంతపుర’ సీరియల్‌ ద్వారా గుర్తింపు పొందిన సుశీల్‌ గౌడ విడుదలకు సిద్ధమవుతున్న ‘సలగ’ చిత్రంలో పోలీసు అధికారి పాత్ర పోషించారు. సుశీల్‌ కేవలం నటుడే కాక ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, మోడల్‌ కూడా. సుశీల్‌ మృతి పట్ల ‘సలగ’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దునియ విజయ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుశీల్‌ ఆత్మహత్యకు కారణం ఏదైనప్పటికీ.. ఆత్మహత్య ఏమాత్రం పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఎప్పటికైనా కన్నడ చిత్రసీమలో టాప్‌ హీరో కావాల్సిన వ్యక్తి ఇలా తమను వదిలివెళ్లిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని