హీరోతో గుత్తా జ్వాల నిశ్చితార్థం

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ కథానాయకుడు విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. విష్ణును వివాహం చేసుకోబోతున్నానని గుత్తా సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. కాగా వీరిద్దరు తాజాగా ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. సోమవారం....

Published : 07 Sep 2020 14:16 IST

ఫొటోలు షేర్‌ చేసిన విష్ణు విశాల్‌

చెన్నై: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ కథానాయకుడు విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. విష్ణును వివాహం చేసుకోబోతున్నానని గుత్తా సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. కాగా వీరిద్దరు తాజాగా ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. సోమవారం గుత్తా 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన ప్రేయసికి శుభాకాంక్షలు చెబుతూ విశాల్‌ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు గుత్తా జ్వాల. ఇది మన జీవితాలకు కొత్త ఆరంభం. ఇలానే పాజిటివ్‌గా ఉందాం. మన బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు వేద్దాం. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మా కోసం అర్ధరాత్రి సమయంలోనూ ఉంగరం తెచ్చిన బసంత్‌ జైన్‌కు (గుత్తా జ్వాల మేనేజర్‌) ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

దీనికి బసంత్‌ జైన్‌ స్పందిస్తూ.. ‘ఎస్‌.. ఇద్దరికీ శుభాకాంక్షలు’ అని కామెంట్‌ చేశారు. ‘నూతన ఆరంభం’ అంటూ గుత్తా కూడా ఆనందం వ్యక్తం చేశారు. పుట్టినరోజునే వీరు నిరాడంబరంగా నిశ్చితార్థం చేసుకుట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉంగరంతో తీసుకున్న ఫొటోల్ని విష్ణు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇవి ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లతోపాటు ప్రముఖులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

2005లో గుత్తా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ను పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇద్దరు విడిపోయారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్‌ వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని