మరో మెట్టు ఎక్కా!

‘‘నటుడిగా నాలో నాకు తెలియని మరో కోణాన్ని బయట పెట్టేలా చేసిన చిత్రమిది.   జగపతిబాబు సర్‌తో కలిసి తెర పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు యువ కథా   నాయకుడు రామ్‌కార్తీక్‌. ఆయన ప్రధాన పాత్రధారిగా

Published : 11 Feb 2021 01:30 IST

‘‘నటుడిగా నాలో నాకు తెలియని మరో కోణాన్ని బయట పెట్టేలా చేసిన చిత్రమిది.   జగపతిబాబు సర్‌తో కలిసి తెర పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు యువ కథా   నాయకుడు రామ్‌కార్తీక్‌. ఆయన ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌.సి.యు.కె (ఫాదర్‌ చిట్టి ఉమ కార్తీక్‌)’. విద్యాసాగర్‌ రాజు దర్శకుడు. శ్రీరంజిత్‌ మూవీస్‌ పతాకంపై కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ నిర్మించారు. ఈ నెల 12న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. రామ్‌కార్తీక్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘ఇందులో కార్తీక్‌ అనే పాత్రని పోషించా. పక్కింటి అబ్బాయి తరహా పాత్ర. విద్యాసాగర్‌ రాజు ప్రతిభగల దర్శకుడు. కార్తీక్‌... ఉమ మధ్య చిట్టి అనే చిన్నారి వచ్చాక ఏం జరిగింది? తండ్రీ, కొడుకుల మధ్య ఎలాంటి అపార్థాలు వచ్చాయనే అంశాలు ఇందులో కీలక’’మన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని