రచన కూడా నెట్‌ ప్రాక్టీసే

తెలుగువాడైనా తన తొలి సినిమాని హిందీలో తీశారు దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌. ఆ తర్వాత విజయవంతమైన ‘ఊపిరి’, ‘మహర్షి’ చిత్రాలకి ...

Updated : 25 Mar 2021 08:31 IST

తెలుగువాడైనా తన తొలి సినిమాని హిందీలో తీశారు దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌. ఆ తర్వాత విజయవంతమైన ‘ఊపిరి’, ‘మహర్షి’ చిత్రాలకి రచయితగా పనిచేసి ప్రతిభని చాటారు. ఇటీవల నాగార్జున కథానాయకుడిగా ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అహిషోర్‌ సాల్మన్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

క పత్రికలో నేను చదివిన ఓ వ్యాసం నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథే ఇది. 2007లో లుంబినీపార్క్‌, గోకుల్‌ ఛాట్‌లో పేలుళ్లు జరిగాయి. ఆ తర్వాత ఐదారేళ్లపాటు ప్రజల్లో ఒక రకమైన భయం కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ఈ పేలుళ్ల వెనక ఎవరున్నారో నిగ్గు తేల్చే బాధ్యతని ఎన్‌.ఐ.ఎ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ)కి అప్పగించింది. ఇలాంటి అండర్‌ కవర్‌ ఆపరేషన్లలో పాల్గొనే అధికారుల వివరాలు అత్యంత గోప్యం. ఈ ఆపరేషన్లలో వాళ్లు మరణించినా ఎవరికీ తెలియని పరిస్థితి. కేవలం దేశం మీద ప్రేమ, భక్తి, విధుల పట్ల అంకిత భావంతో ఇదంతా చేస్తుంటారు వాళ్లు. స్ఫూర్తిదాయకమైన ఇలాంటి విషయాలు తెలిశాక ‘ఈ హీరోల కథ చెప్పాల్సిందే’ అని నిర్ణయించుకున్నా. అదే..‘వైల్డ్‌ డాగ్‌’.
కొత్త రకమైన ప్రయత్నాలు చేయడంలోనూ, కొత్త కథల్ని ప్రోత్సహించడంలో నాగార్జున ముందుంటారు. ‘గీతాంజలి’, ‘ఊపిరి’ లాంటి చిత్రాలొచ్చాయంటే కారణం అదే కదా. అందుకే నాగార్జున సర్‌ ఈ సినిమా చేస్తేనే బాగుంటుందని ఆయనకి కథ చెప్పా. వినగానే చేస్తానని చెప్పారు.  
హిందీలో నా తొలి సినిమా ‘జాన్‌ డే’ విడుదలైన తర్వాత నాలుగైదు నెలలకే మరో అవకాశం వచ్చింది. కానీ అది పట్టాలెక్కలేదు. ఆ సమయంలోనే ఈ చిత్ర నిర్మాత నిరంజన్‌ రెడ్డి ‘ఊపిరి’ సినిమాకి రచయితగా పనిచేయమని పిలిచారు. సచిన్‌ తెందూల్కర్‌ సెంచరీ కొట్టాడని, నెట్‌ ప్రాక్టీస్‌ చేయడం ఆపుతాడా? రచన కూడా నెట్‌ ప్రాక్టీస్‌లాంటిదే. సినిమా చేయాలంటే కచ్చితంగా రాసుకోవల్సిన అవసరం లేదు కానీ... మంచి రచనా కాదా? మంచి నటనా కాదా అనే విషయాలపై అవగాహన మాత్రం ఉండాలి. నేను రైటర్‌ డైరెక్టర్‌ని.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts