‘వేదం’ నాగయ్య కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ‘వేదం’ నాగయ్య గుంటూరు జిల్లా నకరికల్లు మండలం దేచవరంలో శనివారం కన్నుమూశారు. ‘వేదం’ చిత్రంతో ఈయన సినీ పరిశ్రమకు పరిచమయ్యారు.

Published : 28 Mar 2021 02:27 IST

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ‘వేదం’ నాగయ్య గుంటూరు జిల్లా నకరికల్లు మండలం దేచవరంలో శనివారం కన్నుమూశారు. ‘వేదం’ చిత్రంతో ఈయన సినీ పరిశ్రమకు పరిచమయ్యారు. 30 చిత్రాల్లో నటించారు. మాదాసు నాగయ్య... తన నటనతో ‘వేదం’ నాగయ్యగా మారారు. ఎలాంటి శిక్షణ  పొందనప్పటికీ సహజమైన హావభావాలతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. నంది పురస్కారమూ అందుకున్నారు. ‘వేదం’లో ఆయన చెప్పిన ‘పద్మ మన పైసలు దొరికాయే..  నీ బిడ్డ సదువుకుంటాడే’’ వంటి  డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తొలుత నాగయ్య గొడుగులు అమ్ముకుని జీవించేవారు. ఆయన భార్య కోటమ్మ ఐదేళ్ల క్రితం మృతి చెందారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని