Happy Brothers day: అరుదైన ఫొటో షేర్ చేసిన చిరు

సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా త‌న సోద‌రులు, అభిమానుల‌కుసోద‌ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి. 

Published : 24 May 2021 16:25 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా త‌న సోద‌రులు, అభిమానుల‌కు సోద‌ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి. సోమ‌వారం సోద‌రుల దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న సోద‌రుల‌తో దిగిన ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారాయ‌న‌. ‘తోడబుట్టిన బ్ర‌ద‌ర్స్‌కి, రక్తం పంచిన బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌కి హ్యాపీ బ్ర‌ద‌ర్స్ డే’ అని ట్వీట్ చేశారు. ఇది వాళ్ల చిన్న‌ప్పుడు దిగిన ఫొటో. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ఎత్తుకొని క‌నిపించారు చిరంజీవి. నాగ‌బాబుపై  చెయ్యి వేసి నవ్వుతూ ద‌ర్శ‌న‌మిచ్చారు ప‌వ‌న్ . ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీన్ని చూసిన వారు కామెంట్ల రూపంలో త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
 

 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts