18 pages: రాసే అక్షరాలకు ఫీలింగ్‌ ఉంటుంది

నిఖిల్‌ కథానాయకుడిగా సూర్య ప్రతాప్‌ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘18 పేజీస్‌’. బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ప్రముఖ   దర్శకుడు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే

Updated : 02 Jun 2021 10:57 IST

నిఖిల్‌ కథానాయకుడిగా సూర్య ప్రతాప్‌ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘18 పేజీస్‌’. బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. మంగళవారం నిఖిల్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సిద్ధు పాత్రలో నిఖిల్‌, నందిని పాత్రలో అనుపమ కనిపించనున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. ఇందులో నిఖిల్‌ కళ్లపై ఓ కాగితాన్ని గంతలు కట్టినట్లుగా ఉంచి.. దానిపై అనుపమ తన మనసులోని భావాలను రాస్తున్నట్లుగా చూపించారు. ‘‘నా పేరు నందిని. నాకు ఫోన్‌లో అక్షరాలను టైప్‌ చెయ్యడం కంటే ఇలా కాగితంపై రాయడం ఇష్టం. టైప్‌ చేసే అక్షరాలకి ఎమోషన్స్‌ ఉండవు.. ఎవరు టైప్‌ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ, రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్‌ ఉంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది’’ అని ఆ పేపర్‌పై రాసుంది. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చూస్తే.. ఇదొక విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందుతున్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: వసంత్‌ కుమార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని