Ram: సీమ టచ్‌

లింగుస్వామి అనగానే తెలుగు ప్రేక్షకులకు మొదట గుర్తుకొచ్చేది ‘పందెంకోడి’ సినిమానే.

Updated : 03 Jun 2021 10:07 IST

లింగుస్వామి అనగానే తెలుగు ప్రేక్షకులకు మొదట గుర్తుకొచ్చేది ‘పందెంకోడి’ సినిమానే. అది ప్రేక్షకుల ముందుకొచ్చి చాలా యేళ్లే అయినా ఇప్పటికీ ఆ చిత్రాన్ని మరిచిపోలేదు. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యాన్ని అందులో మేళవించిన తీరు ఆకట్టుకుంది. అదే తరహా సీమ టచ్‌తో లింగుస్వామి తదుపరి సినిమా కూడా తెరకెక్కనుందని సమాచారం. ఆ సినిమా రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. రామ్‌ పోలీస్‌గా సందడి చేయనున్నట్టు సమాచారం. ఈ కథలో రాయలసీమ నేపథ్యం ఉంటుందని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని